షాహిద్ కపూర్ పెళ్లి విందు ఆ 'పాన్'తో ముగించాల్సిందే!
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ వివాహం రేపు ఢిల్లీలో జరుగనుంది. వెడ్డింగ్ ప్లానర్ కు అన్ని పనులు అప్పజెప్పిన షాహిద్ కుటుంబం హాయిగా పెళ్లికి ముస్తాబవుతోంది. పెళ్లి కార్డు నుంచి వివాహమహోత్సవం ముగిసేవరకు అన్ని పనులను వెడ్డింగ్ ప్లానర్లు చక్కబెడుతున్నారు. విందుకు వచ్చిన అతిథులు చివర్లో ఆరగించేందుకు పాన్ ను రాజస్థాన్ నుంచి తెప్పించనున్నారు. బాలీవుడ్ ప్రముఖుల నివాసంలో ఎవరి ఇంట్లో వివాహం జరిగినా పాన్ లు సరఫరా చేసే పాన్ భండార్ నుంచి ఖుజూర్ పాన్ ను తెప్పించనున్నారు. రాజస్థాన్ జయపురలోని అన్ను మొబైల్ పాన్ భండార్ కు వెడ్డింగ్ ప్లానర్స్ ఆర్డర్ ఇచ్చారు. ఈ షాప్ నుంచే కరీనా కపూర్ వివాహానికి, అమితాబ్ బచ్చన్ సోదరుడి కుమార్తె వివాహానికి పాన్ తయారు చేసి పంపినట్టు షాప్ యజమాని తెలిపారు. షాహిద్ విందుకు డ్రై ఫ్రూట్స్, రోజ్, గుల్కంద్ తో ఖుజూర్ పాన్ తయారు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.